తాళం వేసిన ఇంట్లో చోరీ..

Burglary in locked house..– ఐదు గ్రాముల బంగారం, రూ.45 వేల నగదు చోరీ
నవతెలంగాణ – కుభీర్
మండలంలోని సోనారి గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన సూర్య వంశీ దేవానంద్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఇంటికి తాళం వేసి బంధువుల గ్రామమైన బెల్గాం గ్రామంలో నూతన గృహప్రవేశానికి వెళ్లారు. శనివారం ఉదయం దేవానంద్ ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించి ఫోన్ ద్వారా ఇంటి పక్క వారు సమాచారం అందించారు. దేవానంద్ వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తలుపులు పగలగొట్టి ఉన్నాయి బీరువాలో ఉన్న ఐదు గ్రాముల బంగారం.. రూ. 45 వేల నగదు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దొంగతనం జరిగిన ఇంటిని కుబీర్ ఎస్ ఐ పరిశీలించి దేవానంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.