తాళం వేసిన ఇంట్లో చోరీ ..

– నాలుగు తులాల బంగారం రూ.80 వేల నగదు అపహరణ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఓ ఇంట్లో భారీగా చోరి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. నగరంలోని వెంగళరావు కాలానికి చెందిన మహమ్మద్ గౌస్ గురువారం అనారోగ్యం తో ఆసుపత్రికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగల గొట్టి ఉంది. లోపలికి వెళ్లేసరికి  బీరువా తెరిచి ఉంది.అందులో నుంచి 4 తులాల బంగారం, రూ.80,000 నగదు అపహరించినట్లు బాధితుడు తెలిపాడు.