
నవతెలంగాణ ఆర్మూర్ :- తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని బీచ్ గల్లీకి చెందిన గోక లత తండ్రి మృతి చెందడంతో అంత్యక్రియలకు నాగం పేటకు వెళ్లి పది రోజులుగా అక్కడే ఉండగా, ఇంటికి తాళం వేసి ఉందని, ఉదయం లత వదిన స్వరూప వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయని, సమాచారం ఇవ్వగా లత ఇంటికి వచ్చి చూడగా బీరువాలను పగలగొట్టి అందులో నుండి 15 తులాల బంగారం, 20 తులాల వెండి, మూడువేల నగదును అపహరించారని తెలిపింది.ఓకే దగ్గర ఉంచిన అన్నదమ్ములు, అక్క బంగారం ఎత్తుకెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.