తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో గల సోయక్ పాష అనే వ్యక్తి గాంధారిలో కొత్త ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నాడు. నిన్న తన కుటుంబ సభ్యులతో సహా ఇఫ్తార్ విందు ఉన్నందున సాయంత్రం పాత ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉండి, ఉదయం  తన కొత్త ఇంటికి వచ్చి చూసేసరికి గుర్తు తెలియని వ్యక్తులు అతని ఇంటి యొక్క తాళం పగలగొట్టి  బీరువాలో గల అర తులం బంగారు గుండ్లు, వెండి పట్టగొలుసులు, రూ.5000 రూపాయలు నగదు దొంగతనం జరిగినట్టు తెలిపినాడు. పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ ఆంజనేయులు తెలిపారు.