నవతెలంగాణ – ఆర్మూరు
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో ఆదివారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఇల్లే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నారు. కామారెడ్డికి ఆస్పత్రి పనిమీద వెళ్లి వచ్చేలోగా దుండగులు చోరీకి పాల్పడ్డారని ఇంటి యజమాని తాజుద్దీన్ తెలిపారు. మహమ్మద్ తాజుద్దీన్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎస్ టి ఓగా విధులు నిర్వహిస్తున్నారు. పేర్కిట్లో నివసిస్తున్నారు. పది తులాల వరకు బంగారము, రూ.1లక్ష నగదు, వెండి కూడా చోరీకి గురైందన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.