మండలం షర్ట్ పెళ గ్రామంలో రెండిళ్లలో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని చాకలి కర్రన్న నిమ్మ భూమా అనే ఇద్దరు ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రాత్రి సమయంలో ఇంట్లో దూరి ఇండ్లలోని వస్తువులను దొంగలించినట్లు బాధితులు తెలిపారు. చాకలి కర్రన్న ఇంటిలో రూ.5000 రూపాయలు, నిమ్మ బూమ ఇంటిలో తులం వెండి ఎలక్ట్రికల్ గ్రైండర్ ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. నిందితులు ద్విచక్ర వాహనంపై మాస్కులు ధరించి ఉన్నట్లు సిసి ఫుటేజ్ లో కనిపించినట్లు స్థానికులు తెలిపారు.