
మండలంలోని రామచంద్ర పల్లి గ్రామంలోని చెరువులో బర్లా కాపరి మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని బార్ల కాపరి జ్వాల దుర్గయ్య (65) గేదెలను సోమవారం సాయంత్రం తీసుకొని వెళ్ళి చెరువులో గేదెలతో పాటు దిగి ఊపిరి ఆడక మునిగి పోయాడని, మంగళవారం ఉదయం శవం బయటకు తేలినట్లు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, మృతుని బార్య దుర్గమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.