నవతెలంగాణ – కంఠేశ్వర్
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పేరుతో ఆదివారం హైదరాబాద్ లో జరిపిన మాలల సింహ గర్జన కేవలం ఈ ముగ్గురు మాల మనువాదులు వీరి రాజకీయ భవిష్యత్తు కోసం మాల మాదిగ, ఉప కులాల మధ్యన వైశ్యామ్యాలు రెచ్చగొడుతున్నారని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ అన్నారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో మాల ఎమ్మెల్యే లు జి. వివేక్ వెంకటస్వామి, మల్లు రవి, కే ఆర్. నాగరాజ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..60 ఏళ్లుగా మాలలు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ సాధించిన 15% రిజర్వేషన్లు ఏకపక్షంగా అనుభవిస్తూ దళితుల్లో ఉన్న మాదిగ, ఉప కులాలకు అందకుండా చేస్తున్నారనే గత 30 ఏళ్లుగా దళితుల్లో వర్గీకరణ జరగాలని అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు అందరూ సమానంగా పంచుకోవాలని ఉద్యమం చేస్తుంటే కేవలం మాలల్లో ఉండే కొంతమంది ఇలాంటి మనువాదులు రిజర్వేషన్లు మొత్తం మేమే అనుభవిస్తామనే పద్ధతిలో సభలు సమావేశాలు పెడుతూ మాలలను రెచ్చగొడుతున్నారు. ఈ ముగ్గురు మనువాదులు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.
1965 లోనే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా లోకూర్ కమిషన్ వేసింది. 1975 లోనే పంజాబ్ లో వర్గీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉషా మెహ్ర కమిషన్ వేసి, అసెంబ్లీలో తీర్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ అలాగే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రు లు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కి వర్గీకరణ చేయాలని లేఖలు రాశారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ కూడా వర్గీకరణకు అనుకూలంగా ఢిల్లీలో మాదిగ జాతి వేదికలపై వచ్చి వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే చేవెళ్ల డిక్లరేషన్ లో ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 1 న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిండు అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ చేసి మాదిగ ఉప కులాలకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అయినా ఈ ముగ్గురు మనువాదులు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ మాల మాదిగలు, ఉప కులాల మధ్యన చిచ్చు పెడుతున్నారు. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని వీరిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అదేవిధంగా వర్గీకరణ చేసి మాదిగ మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా నాయకులు మల్లాని శివ, కొత్తపేట రమేష్, ప్రకాష్, అన్న బాహు సాటి సంగం జిల్లా అధ్యక్షులు గంగాధర్ గైక్వాడ్, మేనత్ కర్ శంకర్, గైక్వాడ్, హరీష్ మాదిగ జేఏసి జిల్లా నాయకురాలు బాయికాడి లత, సువర్ణ, సమత, శ్రీదేవి, మహేష్, తదితరులు పాల్గొన్నారు.