బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం

నవతెలంగాణ – మాక్లూర్

మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో బండి సంజయ్ దిష్టి బొమ్మను సోమవారం దహనం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రవి ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై మండిపడ్డారు. ప్రతి ఒక్కరికీ తల్లి ఉందని, తల్లిని అవమానించడం సంస్కార హినమని తెలిపారు. రాజకీయాలకు, తల్లికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి ప్రకాష్, పంచాయతీ రాజ్ సంఘటన అధ్యక్షులు గంగాధర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎంపిటిసి వెంకటేశ్వర్ రావు, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పీర్ సింగ్, సింగిల్ విండో చైర్మన్ బురోల్ల అశోక్, మట్ట రాము, అరిఫ్, లచ్చరెడ్డి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు సలీం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.