కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద విద్యార్థులకు నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్, గుండెబోయిన శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దిష్టిబొమ్మ దహనం నిరసన కార్యక్రమంలో బి ఆర్ ఎస్ టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, బట్టు రామచంద్రయ్య, బిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ జంగం పాండు, కౌన్సిలర్ భగత్, సిరిపంగా సుభాష్ తుమ్మేటి మహేష్, ముఖ్య నాయకులుగా వందలాది మంది విద్యార్థులతో నిరసనగా ప్రిన్స్ చౌరస్తాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం చేసి, ధర్నా నిర్వహించారు. అఖిలపక్ష నాయకులకు పోలీసులకు మధ్య వివాదం తలెత్తడంతో ధర్నా ఉధృతంగా మారింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బీసీలకు బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించడం దుర్మార్గం 60 శాతం ఉన్న బీసీలకు రాష్ట్ర బడ్జెట్లో 2% విధులు కేటాయించడం దుర్మార్గం ఈ సిగ్గులేని రాష్ట్ర ప్రభుత్వం బీసీలే ఊపిరి అని చెప్పి అధికారంలోకి వచ్చాక బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచాక బీసీలను విస్మరించడం అన్యాయమన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సవరించి బీసీలకు అధిక సంఖ్యలో నిధులు కేటాయించి విద్యార్థులకు రావాల్సిన బడ్జెట్ను ఇవ్వాలన్నారు 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 85 కోట్లున్న బీసీలకు కేంద్ర ప్రభుత్వం 3300 కోట్లు కేటాయించడం దుర్మార్గం అన్నారు దోపిడి పీడన వివక్షకు గురవుతున్న జాతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయ విద్యా వైద్య రంగాలలో అవకాశాలు కల్పించాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బడ్జెట్ను సవరించి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సామాజికవేత బట్టు రామచంద్రయ్య, కౌన్సిలర్ భగత్, తిరుపంగా సుభాష్, తుమ్మేటి మహేష్, గుండెబోయిన శంకర, నాకోటి నాగేష్, చిన్న, రమాదేవి, ఉషారాణి, భాస్కర్, వినయ్, సుమన్ లు పాల్గొన్నారు.