ఖాళీ ధాన్యం బస్తాల దగ్ధం

నవతెలంగాణ – నిజాంపేట
మెదక్‌ జిల్లా రామాయంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో రబీ సీజన్‌ వరి ధాన్యాన్ని సేకరించడానికి కొనుగోలు కేంద్రాన్ని మండల పరిధిలోని రాంపూర్‌ గ్రామంలో ప్రారంభించారు. ఆ కొనుగోలు కేంద్రంలో కొత్త ధాన్యం బస్తాలు 5000 వేలు, పాతవి 5000 స్టోరేజ్‌ చేసినట్లు సీఈఓ పుట్టి నర్సింహులు తెలిపారు. సోమవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 2300 గన్ని బ్యాగ్స్‌ దహనం చేసినట్టు తెలిపారు. ఒక్క బస్తా ఖరీదు 80 రూపాయలు దీని వల్ల సొసైటీకి సుమారు రూ.1,84,000వేల నష్టం వాటిల్లిందన్నారు. దీనిపై సెంటర్‌ ఇన్‌ఛార్జి డి మహేష్‌తో కలిసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఘటనపై అనుమానాలు ఉన్నాయని అన్నారు.