గుండారం గౌడ సంఘాధ్యక్షుడిగా బుర్ర రాజయ్య…

నవతెలంగాణ-బెజ్జంకి : మండల పరధిలోని గుండారం గ్రామ గౌడ సంఘాధ్యక్షుడిగా బుర్ర రాజయ్య గౌడ్, ఉపాధ్యక్షుడిగా తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అనంతరం నూతన కార్యవర్గ కమిటీ కార్యవర్గ సభ్యులను పలువురు గ్రామస్తులు శాలువా కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో యాదయ్య, బాలయ్య,నరేష్,రాములు తదితరులు ఉన్నారు.