– నీటి వృధా పై గ్రామస్తుల ఆగ్రహం
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం రంగాపూర్ గ్రామం లోని మిషన్ భగీరథ ట్యాంక్ వద్దగల పైపు పగిలిపోవడంతో మీరు వృధాగా పోతుంది. రంగాపూర్ లో నీటి సమస్య వెంటాడుతున్న, మిషన్ భగీరథ నీరు వృధాగా పోతున్న, సంబంధిత మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యంతో పట్టించుకోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు పరిశీలించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మిషన్ భగీరథ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మిషన్ భగీరథ ఏఈ నవీన్ ను వివరణ అడగగా పైప్ లైన్ లీకేజీ సమస్యను పరిష్కరించి గ్రామంలో నీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.