వివిధ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బస్సు ఏర్పాటు

నవతెలంగాణ – ఆర్మూర్  

రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీల్లో, జూనియర్ కాలేజీల్లో టి.జి.టీ, పి.జి.టీ, జే.యల్ లు గా ఎంపికైన అభ్యర్థులకు సోమవారం పట్టణ కేంద్రం నుండి బస్సు ఏర్పాటు చేసినట్టు తహసిల్దార్ గజానన్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందించడం జరుగుతుంది అని అన్నారు. కావున  డివిజన్ పరిధిలో ఎంపికైన అభ్యర్థులను బస్ సౌకర్యం ఏర్పాటు చేసి హైదరాబాద్ కి ముఖ్యమంత్రి కార్యక్రమానికి పంపించడం జరిగింది అని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆర్ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు.