బస్సు సౌకర్యం కల్పించాలి

నవతెలంగాణ మోర్తాడు 
గతంలో మెట్పల్లి కోరుట్ల డిపోకు చెందిన  రెండు బస్సులు మండల కేంద్రం నుండి దొనకల్ ధర్మోరా షట్పెల్లి గ్రామాల మీదుగా నిర్మల్కు వెళ్లే రెండు బస్సు సౌకర్యాలను ఉండవని ప్రస్తుతం వాటిని తొలగించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆ సౌకర్యం కల్పించాలంటూ షర్టుపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మెట్పల్లి నిర్మల్ డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఆయా డిపో మేనేజర్లు రహదారి పరిశీలన చేసినట్లు షెట్పెల్లి గ్రామస్తుడు గురజాల నర్సారెడ్డి తెలిపారు. నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమ, మెట్పల్లి డిపో మేనేజర్ దేవరాజ్ సంయుక్తంగా రూట్ రహదారిని పరిశీలించి బస్సు సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.