
మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామీ గుట్టకు బస్సు సౌకర్యం కల్పించాలని మంగళవారం ఆ ప్రాంత ప్రఙలు యాదగిరిగుట్ట డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భముగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి నుండి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని వెంటనే అధికారులు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బండారు నరసింహారెడ్డి, లింగయ్యయాదవ్, ఆవుల సత్యనారాయణ, జినుకల మల్లేష్, ఆవుల అంజయ్య,పిట్టల సుధాకర్, కసర బోయిన నరసింహ తదితరులు పాల్గొన్నారు.