మేడారం జాతరకు బస్సు సౌకర్యం..స్థానిక గ్రామాలకు బస్సు కొరత

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
బాన్సువాడ డిపో పరిధిలోగల భక్తుల సౌకర్యార్థం మేడారం జాతర సందర్భముగా ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ ఆర్టీసీ బాన్సువాడ డిపో మేనేజర్ సరితా దేవి తెలిపినారు.ఆదివారం బస్సు డిపోలో ఆమె విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లో తెలంగాణ కుంభమేళాగా వేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఈనెల 19 నుండి 25 అంటే( సోమవారం నుండి సోమవారం వరకు) ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి, మన బాన్సువాడ డిపో నుండి 62 బస్సులు వరంగల్ జిల్లాకు వెళ్ళుచున్నవి. కావున ఈ సమయంలో జిల్లాలో బస్సుల ట్రిప్పుల సంఖ్యను తగ్గించినందుకు ప్రయాణికులకు కొంత అసౌకర్యము కలుగవచ్చునని ఆమె పేర్కొన్నారు ఈ విషయాన్ని ప్రయాణికులు గమనంలోకి తీసుకొని ఆర్టీసీకి సహకరించగలరని డిపో మేనేజర్ గారు తెలిపినారు.