
ఈనెల 9న ఆదివారం ఉదయం 6 గంటల నుండి మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా ఆలయం నుండి ప్రారంభమయ్యే భక్తుల పాదయాత్ర నసురుల్లాబాద్ సమీపంలోని శ్రీ సాయిబాబా ఆలయం నెమలికి చేరుకుంటుంది. ఈ పాదయాత్రలో చిన్న పెద్ద మహిళలు పురుషులు తేడా లేకుండా వందల సంఖ్యలో భక్తులు పాదయాత్రలో ప్రతి సంవత్సరం పాల్గొంటున్నారు. ఏడాదికి ఏడాది పాదయాత్ర భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది మద్నూర్ నుండి పాదయాత్రగా నెమలి గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆలయానికి చేరుకొని దర్శించుకున్న అనంతరం తిరిగి వచ్చే భక్తులకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సహకారంతో బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. పాదయాత్ర భక్తుల కోసం బస్సు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యేకు శ్రీ సాయిబాబా పాదయాత్ర భక్తులు అభినందనలు తెలియజేశారు.