ఆధార్ లో ఆంధ్రప్రదేశ్ ఉంటే బస్ ఫ్రీ కాదు..!

నవతెలంగాణ-భిక్కనూర్
ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ ఉంటే మహిళలకు బస్ ఫ్రీ ఉండదని తప్పనిసరిగా తెలంగాణ అని ఉంటేనే ఫ్రీ బస్ మహిళలు ఎక్కవచ్చని కొందరు కండక్టర్లు మహిళలకు తెలియజేయడంతో ఆధార్ సెంటర్ వద్ద తెలంగాణ అని మార్చుకోవడానికి మహిళలు క్యూ కడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళల ఆధార్ కార్డులో ఇంటి నెంబర్, గ్రామం, మండలం, జిల్లాతో కూడిన వివరాలు ఆధార్ కార్డులో ఉన్న కండక్టర్లు మాత్రం తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న కారణంగా మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం చేయకుండా డబ్బులు చెల్లించి ప్రయాణం చేయాలని కండక్టర్లు తయారు చేస్తున్నట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పాత ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని పేరు ఉన్న కారణంగా మరోసారి ఆధార్ కార్డు మార్చుకోవడానికి మహిళలు ఆధార్ సెంటర్ వద్ద క్యూ కడుతున్నారు. జిల్లా, మండలం, గ్రామం పేరు చూసి కండక్టర్లు ఉచిత ప్రయాణం చేయడానికి మహిళలకు అభ్యంతరాలు తెలియజేయకుండా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుకుంటున్నారు.