
దివ్యాంగులకు రాయితీపై అందిస్తున్న ఆర్టీసీ బస్ పాస్ లను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారి బుచ్చిరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని కాచాపూర్ గ్రామంలో దివ్యాంగులకు రాయితీ బస్ పాస్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 శాతం రాయితీపై ఎక్కడికైనా దివ్యాంగులు ప్రయాణించవచ్చని, ఈ అవకాశాన్ని ఆర్టీసీ సంస్థ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి దివ్యాంగులకు బస్ పాస్ లను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఉన్నారు.