నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని కాచికల్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ వారి సహకారంతో బస్సు షెల్టర్ ను ప్రారంభించినట్లు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపాడు. కాచికల్ గ్రామంలో పొందూరు గీతారెడ్డి రాజేందర్ రడ్డి 50వ వివాహ ఉత్సవ సందర్భంగా లక్ష రూపాయల వ్యయంతో బస్సు షెల్టర్ నిర్మించి ఆదివారం ప్రారంభించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఇతర గ్రామంలో స్థిరపడినప్పటికీ గ్రామాభివృద్ధి లక్ష్యంగా కుందూరు గీతారెడ్డి రాజేందర్ రెడ్డిల వివాహ వాత్సవ సందర్భంగా ఈ కాచికల్ గ్రామంలో రుణం తీర్చుకోవడం కోసం ఒక లక్ష రూపాయల వ్యయంతో బస్సు షెల్టర్ ను నిర్మించినట్లు తెలిపారు. పుట్టి పెరిగినందుకు గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు లైన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ అధ్యక్షుడు గంజి విజయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ బస్సు షెల్టర్ ను ప్రారంభించిన టు తెలిపారు ప్రయాణికులకు ఎండలో నిలబడకుండా వర్షంలో తడవకుండా కాచికల్ గ్రామస్తుల అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు అనుకూలంగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించి శాలువతో ఘనంగా మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి అభినందించారు. అనంతరం లైన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ వారు ఎమ్మెల్యే మురళి నాయక్ ను శాలతో ఘనంగా సత్కరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వపు జిల్లా గవర్నర్లు పొందూరు రాజేందర్ రెడ్డి లక్ష్మీనరసింహ లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ అధ్యక్షుడు గంజి విజయపాల్ రెడ్డి సెక్రటరీ పెరుమాండ్ల రమేష్ కోశాధికారి శ్రీనివాస్ ఆర్కే లైన్ శారద జడ్సీ వెంకటేశ్వర్లు రేగురి వెంకన్న డాక్టర్ యాదగిరి రడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ జిల్లా నాయకులు బాలాజీ నాయక్ లక్ష్మారెడ్డి మద్ది రాజేష్ కొంపల్లి శ్రీశైలం యాదవ్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాజీ ఎంపిటిసి ప్రకాష్ నాయకులు దేవేందర్ రెడ్డి శ్రీను సుధాకర్ అశోక్ బంకు దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.