బీబీనగర్ మండలం మాదారం గ్రామానికి బస్సును పునరుద్దరించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటి సభ్యులు వెలువర్తి శ్రీకాంత్ మహారాజ్ కోరారు. శనివారం బస్సును పునరుద్దరించాలని కోరుతూ యాదగిరిగుట్ట డిపో మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ కు శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో నడిచే బస్సు కరోనా కారణంగా నిలిపివేశారని, కొన్ని సంవత్సరాలుగా గ్రామానికి బస్సు రాకపొవడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సిరివేణికుంట, మాదారం, రావిపహాడ్, రావిపహాడ్ తండా, ముగ్దుంపల్లి, గొల్లగూడెం గ్రామాల ప్రజలు ఉద్యోగరిత్య, వందలాదిమంది విద్యార్థులు తమ చదువుల కోసం నిత్యం భువనగిరి జిల్లా కేంద్రానికి ప్రయాణిస్తుంటారని తెలిపారు. వేళకు ఆటోలు రాక, బస్సు సౌకర్యం లేక గంటల తరబటి రోడ్ల వెంట ఆటోల కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు. గ్రామానికి బస్సు రానప్పుడు ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు ఎలా ఉపయోగించుకుంటారని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి బస్సును పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ శంకర్ పాల్గొనారు.