మూడు విడతలుగా బస్సు యాత్ర

Bus trip in three parts– 18,19,20 తేదీల్లో పాల్గొననున్న రాహుల్‌
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో మూడు విడత లుగా విజయభేరి బస్సుయాత్ర ఉంటుందని రేవంత్‌రెడ్డి అన్నారు. మొదటి విడుతల్లో మూడు రోజులు బస్సు యాత్ర, దసరా తర్వాత రెండవ దశ బస్సు యాత్ర, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడవ దశ బస్సు యాత్ర ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత బస్సు యాత్రలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారు. 18న రామప్ప దేవాలయంలో శివుడికి పూజ చేసి బస్సు యాత్ర ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అదే రోజు భూపాలపల్లిలో మహిళలతో సమావేశం,19న రామగుండంలో సింగరేణికార్మికులతో సమావేశం, పెద్దపల్లిలో పాదయాత్ర, సభ, కరీంనగర్‌లో పాదయాత్ర, సభ 20న జగిత్యాల, బోధన్‌, నిజామా బాద్‌లో పాదయాత్ర, సభలు ఉంటాయని రేవంత్‌ రెడ్డి తెలిపారు.