తంగేడుపల్లికి బస్సులు పున: ప్రారంభం

 Telangana Telugu News Rangareddyనవతెలంగాణ-శంకర్‌పల్లి
మూడు సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి బస్సును సోమవారం పున ప్రారంభించినట్టు కాంగ్రెస్‌ చేవెళ్ల ఇన్‌చార్జి పామేనా బీమ్‌ భరత్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల మండలంలోని తంగేడుపల్లి టూ శంకర్‌పల్లి వయా మణికట్టు సంకెపల్లి, అంతప్పగూడెం, పర్వేద గ్రామాల్లో మూడు సంవత్సరాల క్రితం ఆగిపోయినట్టి ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను ప్రజల సౌకర్యార్థం పున: ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఆర్టీసీ బస్సును ప్రారంభించి టిక్కెట్టు తీసుకుని ఆయా గ్రామాల్లో బస్సులో ప్రయాణం చేశారు. బస్సులో ఎక్కిన మహిళలకు మహాలక్ష్మి టికెట్లు ఇచ్చారు. ప్రజలందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యులు చింపుల సత్య నారాయణ రెడ్డి, చేవెళ్ల సర్పంచ్‌ ఆగి రెడ్డి, డీవీఆర్‌ నేషనల్‌ నాయకులు షేర్‌ అనంత రెడ్డి, శంకర్‌పల్లి మండలం, మున్సిపల్‌ నాయకులు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్‌ నాయకులు, ఎన్‌ఎస్‌ యూఐ నాయకులు కాంగ్రెస్‌ కుటుంబ సభ్యులు తదితరుల తదితరులు పాల్గొన్నారు.