కర్నూల్ రూట్ లో బస్సులను పునరుద్ధరించాలి 

– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మల్లేష్     
నవతెలంగాణ – అచ్చంపేట : స్థానిక ఆర్టీసీ డిపో నుంచి  కర్నూలు బస్సు ను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. దీని ద్వారా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నూల్ గ్రూపులో బస్సులు పునరుద్ధరించాలని సిపిఎం మండల కార్యదర్శి ఎస్ మల్లేష్ డిమాండ్ చేశారు. అచ్చంపేట, నాగర్ కర్నూల్, పరిసర గ్రామాల ప్రజలు కర్నూలు కు వైద్యం ఇతర పనుల మీద వెళ్ళుతుంటారు. బస్సు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు అచ్చంపేట డిపో ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం 8 గంటల కర్నూలు ,పుట్టపర్తి బస్సు  సౌకర్యం ఉన్నదని గుర్తు చేశారు.   ప్రజలకు అనుకూలమైన సమయంలో  సేవలు అందించింది. మధ్యకాలంలో అధికారులు ఈ రెండు బస్సులు రద్దు చేయడం జరిగింది. అధికారుల యొక్క నిర్వాహణ నిర్లక్ష్యం కారణంగా   పై సర్వీసులను నష్టాల పేరుతో రద్దు చేశారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ స్పందించి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి కర్నూలు పుట్టపర్తి బస్సు సర్వీసులను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.