
దుబ్బాక నుంచి పెద్ద చీకోడ్,కమ్మర్ పల్లి,అచ్చుమాయిపల్లి,పర్శరాం నగర్ గ్రామాల మీదుగా వేములవాడకు బస్సులు నడపాలని అచ్చుమాయిపల్లి మాజీ ఉపసర్పంచ్ పర్స దేవరాజ్ కోరారు.ఈ మేరకు సిద్దిపేటలో దుబ్బాక బస్సు డిపో ఇంచార్జ్ మేనేజర్ సుఖేందర్ రెడ్డికి వినతి పత్రం అందించి.. బుధవారం దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కి విన్నవించామని తెలిపారు.ఎమ్మెల్యే స్పందించి డిపో మేనేజర్ తో ఫోన్లో మాట్లాడారు.ప్రజల సౌకర్యార్థం నాలుగు గ్రామాల మీదుగా వేములవాడకు బస్సులు నడపాలని డీఎం సుఖేందర్ రెడ్డిని ఆదేశించారు.ఆయన వెంట మాజీ సర్పంచులు తౌడ శ్రీనివాస్,కరికే భాస్కర్,కృష్ణంరాజు,స్వామి,నరేష్,ఇస్మాయిల్,తిరుపతి,మహేష్ ఉన్నారు.