కారోబార్ సమస్యలు పరిస్కారం చేయాలి

– ఎంపీడీఓ కు విన్నవించిన కారోబార్ సంఘం
నవతెలంగాణ – మల్హర్ రావు
తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోయి పరిస్కారం చేయాలని కారొబార్ సంఘం ఆధ్వర్యంలో  ఎంపీడీఓ శ్యాం సుందర్ కు విన్నవించారు. ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తమ సమస్యలు విన్నవించారు. ఇందుకు ఎంపీడీఓ స్పందించి కారోబార్ల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ విక్రమ్ కుమార్,కారొబార్ సంఘము మండల అధ్యక్షుడు కనుకుల శ్రీకాంత్ ,గౌరవ అధ్యక్షులు అజ్మత్ అలీ, ప్రధాన కార్యదర్శి నారా శేఖర్ జిల్లా ఉపాధ్యక్షులు జాలిగపు శ్రీకాంత్, విజయగిరి బాపు అజ్మీర తిరుపతి పాల్గొన్నారు.