
జ్ఞాన సరస్వతి గ్రంథాలయం 3వ వార్షికోత్సవ ముగింపు వేడుకలకు పోచమ్ పల్లి గ్రామం లో బుధవారం ముఖ్య అతిథిగా బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డిపాల్గొని విద్యార్థిని విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతను వివరించి, విద్య యొక్క ఆవశ్యకతను గురించి మాట్లాడి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందజేశారు.ఈ సందర్బంగా మాట్లాడు గ్రామంలోని రైతులకు ఫౌండేషన్ తరపు చేయు కార్యక్రమాలు వివరించి సేవలను వాడుకోవలసిందిగా కోరారు.అండర్ 19 క్రికెట్లో టాలెంట్ చూపించిన క్రీడాకారిణి స్రవంతికి స్కాలర్షిప్ అందజేశారు.గ్రామ పెద్దలు ఈసందర్బంగా బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డిని శాలువా మరియు మెమెంటో తో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అతిథిలుగా తుమ్మలూరి వెంకటరెడ్డి (భవిత విద్యాసంస్థలు, నల్గొండ), పోచంపల్లి గ్రామ సర్పంచ్ గుత్త తిరుమల్ రెడ్డి, తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, నెల్లికల్లు సర్పంచ్ జనార్ధన్ రెడ్డి,గ్రామ కార్యదర్శి పన్నాల శంకర్,గ్రామ పెద్దలు నిమ్మల అంజిరెడ్డి,తేలుకుంట్ల కుర్మాల్ రెడ్డి,జాల మల్లేష్,సోమ రాములు,గుండె బోయిన సత్యనారాయణ,కుంభం యాదయ్య, శ్రీను, రాములు, శేషగిరి, సత్తిరెడ్డి, యాదగిరి రెడ్డి,ప్రృద్విరాజ్ రెడ్డి,చెనగాని సైదులు, చెనగాని కృష్ణ,వేముల శేఖర్, స్వామి, నరేందర్, శ్రీకాంత్,పోలోజు శివప్రసాద్, అబ్దుల్ కరీం,స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.