
నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలకు బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్, శ్రీ వైష్ణవి కన్ స్ట్రక్షన్స్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండు రంగారెడ్డి భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, రైతులు పాడి పంటలతో తులతూగి, ఆయా రంగాల్లో శ్రేయస్సు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ మన సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రతీకని ఈ పండుగ అందరిలో స్నేహభావం, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని అన్నారు. పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని అన్నారు. ప్రజలు శాంతి, సహనం, ఓర్పుతో మెలగాలని నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.