ఆలయ నిర్మాణానికి రూ.1,00,116 లు ప్రకటించిన బుసిరెడ్డి ఫౌండేషన్

నవతెలంగాణ -పెద్దవూర 
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, త్రిపురారం మండలం, కొణతాల పల్లి గ్రామ సర్పంచ్ మరియు పెద్దల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై శ్రీ సీతారామంజనేయ స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆలయ నిర్మాణానికి గానూ రూ. 1,00,116 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా బుసిరెడ్డి పాండురంగారెడ్డిని  పలువురు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ రామాలయం లేని ఊరు, బడి లేని  ఊరు ఎక్కడ వుండదని పాండురంగారెడ్డి అన్నారు. శ్రీ సీతారామంజనేయ స్వామి గుడి నిర్మాణానికి నా వంతుగా లక్ష నూట పదహార్ల రూపాయలని విరాళంగా ప్రకటించడం నాపూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, కొణతాల పల్లి సర్పంచ్ జొన్నలగడ్డ వెంకటరెడ్డి, నెల్లికల్లు సర్పంచ్ జనార్ధన్ రెడ్డి,ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డి, జొన్నలగడ్డ వేణుగోపాల్ రెడ్డి, రమణారెడ్డి, బలరాం రెడ్డి, మైనంపాటి దామోదరరెడ్డి, రాంరెడ్డి సంతోష్ రెడ్డి, పృధ్వీరెడ్డి,సత్తిరెడ్డి, ధూపాటి భిక్షం,సండ్రాల సైదులు,పరుశురాములు,నాంరెడ్డి వెంకటరెడ్డి, మాజీ కో ఆపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి,షేక్ ముస్తాఫ, బుసిరెడ్డి మట్టారెడ్డి,గజ్జల నాగార్జున రెడ్డి, గజ్జల శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ కరీం మరియు తదితరులు పాల్గొన్నారు.