
– అంత్య క్రియల అనంతరం ఉచితంగా అన్నదానం
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మునగాల జానకిరాములు (45) ఆదివారం అనారోగ్యం తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొని బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి అంత్యక్రియలు అనంతరం భోజనాలు ఉచితంగా పంపించారు. ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడూ అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి గారు పిలుపునిచ్చారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించాలని కోరారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దానాలన్నింటిలో కెల్లా అన్నదానం మిన్నఅని, మనిషిని పూర్తిగా సంతృప్తి పరచేది ఒక్క అన్నదానం మాత్రమే అన్నారు. భగవంతుడు ఇచ్చిన సంపదలో దానధర్మాలు చేస్తున్నాను అని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.