– ఆర్థిక సహాయం చేసిన పాండు రంగారెడ్డి
నవతెలంగాణ -పెద్దవూర
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమల గిరి సాగర్ మండలం సుంకిశాల తండా కు చెందిన విద్యార్థిని గీతాంజలి ఇంటర్ ఫెయిల్ కావడం తో గత కొద్ది రోజుల క్రితం మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకొని బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి సోమవారం వారి తల్లిదండ్రులు హనుమంతు -జ్యోతి లకు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ యంపిపి తిరుమలనాథ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి, కున్ రెడ్డి, సంతోష్ రెడ్డి, అబ్దుల్ కరీం, వెంకటేశ్వర్లు కెవిటి మరియు తదితరులు పాల్గొన్నారు.