– నేనున్నానని మనోధైర్యం కల్పిస్తున్న బుసిరెడ్డి
– మానవత్వం మహా గొప్పది అని చేస్తుతున్నవైనం
నవతెలంగాణ -పెద్దవూర: సేవాతత్పరుడు పాండురంగారెడ్డి నేనున్నానని బడుగు వర్గాలప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ అండగా వుంటా అన్ని విధాలా ఆదుకుంటా అంటూ ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తు సాగర్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండాలేనేదే ఆయన ఉధ్యేశం. అందులో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గం, త్రిపురారం మండలం, మునగపాయిగూడెంగ్రామంలో మేడారం కృష్ణయ్య వయస్సు (75) సంవత్సరాలు స్వర్గస్తులు అయ్యినారని తెలుసుకుని వారి కుటుంబానికి బుధవారం అంత్యక్రియల అనంతరం అక్కడికి వచ్చిన బంధువులకు భోజనాలు ఉంచితంగా పంపించారు.ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి బుసిరెడ్డి ఫౌండేషన్ సేవలు ఎల్లపుడు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఈ సందర్బంగా తెలిపారు.
సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించవలసినదిగా కోరడమైనది. అన్నదానం కోటిగోవుల దాన ఫలితంతో సమానమైనది, ‘అన్ని దానాల్లో అన్నదానం మిన్న`, మనిషిని పూర్తిగా సంతృప్తి పరచేది ఒక్క అన్నదానం మాత్రమే అని తెలిపారు. భగవంతుడు ఇచ్చిన సంపదలో మనిషి బ్రతికివున్నన్ని రోజులు అహంబ్రహ్మస్మి భావనతో నాలో దైవత్వాన్ని అలవరుచుకొని దానధర్మాలు చేస్తున్నాను అని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి తెలిపారు. నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.