నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, అనుముల మండలం శ్రీనాథపురం గ్రామంలో వేదాంత ఇంటర్నేషనల్ స్కూల్ ల్లో ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ ను నియోజకవర్గ స్థాయి పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది కుడా నిర్వహించారు.పోటీలకు బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి విచ్చేసిన క్రీడాకారులకు సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా ఉచిత అన్నదానం చేశారు. పిబ్రవరి 2వ తారీఖున బహుమతుల ప్రదానోత్సవానికి తప్పకుండా హాజరై విజేతలకు సొంత ఖర్చులతో బహుమతులు అందజేస్థామని చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని కార్యదర్శులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర కోశాదికారి ఘనపురం నిరంజన్, ఖాసీం,జిల్లా అధ్యక్షులు ఖాసీం, జిల్లా కార్యదర్శి సతీష్,వర్త్య రమేష్,పంచాయతీ కార్యదర్శులు పంచాయితీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.