మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేసిన బుసిరెడ్డి ..

Busireddy helped the family members of the deceased financially.నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలోగత వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన మృతుల కుటుంబ సభ్యులను శనివారం  బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి  పరామర్శించి దగ్గరకు వెళ ఆర్థిక సహాయం అందజేశారు.మృతులు దారం పరమేష్ యాదవ్, దుబ్బ అంజయ్య,తుడుం లింగయ్య, యాక్సిడెంట్స్ లో మరణించారని  తెలుసుకొని వారి చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ పెద్దవూర సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, పెద్దవూర మండల బిఆర్ యస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ తుడుం రాకేష్, మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,బాలయ్య యాదవ్,కట్టెబోయిన శ్రీను యాదవ్,కమ్మంపాటి వెంకటయ్య,కట్టెబోయిన సురేష్,పిట్టల అంజి,దుబ్బ శ్రీను,రేవెల్లి పెద్దులు,నితిన్,గజ్జల నాగార్జున రెడ్డి, వెంకన్న యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.