
స్వతంత్ర భారాతావని మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ మెహ్రు జన్మదిన సందర్బంగా సాగర్ నియోజకవర్గ ప్రజలకు బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్బంగా మాట్లాడుతూ.. జవహర్‌లాల్ నెహ్రూ జయంతి భారతదేశం యొక్క అత్యంత గౌరవనీయమైన నాయకులలో ఒకరి జీవితం, వారసత్వం మరియు ఆదర్శాలను జరుపుకునే రోజు. భారతదేశంలో పిల్లల అభివృద్ధి, విద్య మరియు శాస్త్రీయ పురోగతిలో ఆయన గొప్ప పాత్ర పోషించారని కొనియాడారు.ప్రతి సంవత్సరం నవంబర్ 14న, భారతదేశం మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని ఎంతో ఉత్సాహంగా మరియు ఆనందంగా జరుపుకుంటున్నామని తెలిపారు.చిన్న పిల్లలందరికీ చాచా నెహ్రూ అని పిలుస్తారు, అతని పుట్టినరోజును దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటారన్నారు. దేశ నిర్మాణానికి ఆయన చేసిన విశేషమైన సేవలను స్మరించుకోవడమే కాకుండా దేశంలోని యువతరం పట్ల ఆయనకున్న గాఢమైన ఆప్యాయతను గుర్తుచేస్తుందని తెలిపారు.