నవతెలంగాణ -పెద్దవూర
హైదరాబాద్ లోని,హాయత్ నగర్ యస్.వి ఫంక్షన్ హాల్ నందు తిరుమలగిరి సాగర్ మండలం గాత్ తండా గ్రామ వాస్తవ్యులు అయినటువంటి మెగావత్ నంద నాయక్ – మాత్రి ఆహ్వానం మేరకు హాజరైనూతన వధూవరులు రమేష్ – వైదేహిలను శుక్రవారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్, పేదల పాలిట పెన్నిధి బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ పెద్దవూర సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, షేక్ ముస్తాఫ, మెగావత్ భాషా నాయక్, గాత్ తండా గ్రామస్తులు పాల్గొన్నారు.