ఓవైపు కొనుగోలు కేంద్రాలు.. మరోవైపు దళారుల కొనుగోలు

On the one hand buying centers.. on the other hand buying brokers– రైస్ మిల్లులను కేటాచయించని వైనం 
– ప్రభుత్వ కేంద్రాలకు రాని ధాన్యం 
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
రైతులు పండించిన ధాన్యమును కొనుగోలు చేసేందుకై ప్రభుత్వం పిఎసిఎస్ సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పాలక నేతలు ఆర్భాటంగా ప్రారంభిస్తున్న, సొసైటీలకు రైస్ మిల్లర్ల కేటాయింపు జరగకపోవడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాని వైనం. దీనితో దళారులు రైతులకు ఆశ చూపి ధాన్యం కొనుగోలు చేస్తుంటే అధికారులు, సిబ్బంది తమకేమీ పట్టనట్లు చేతులు దులుపుకుంటున్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని బీర్కూర్, నసురుల్లాబాద్, బాన్సువాడ మండలాల్లో గత వారం రోజులుగా ధాన్యం కొనుగోలు దళారులు గ్రామాల్లోకి ప్రవేశించి రైతులను ఆశ్రయించి ఆశ చూపుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తాము ఎక్కువ ఇస్తూ, మూడు రోజుల్లో డబ్బులు ఇస్తామని హామీలు ఇవ్వడంతో ధాన్యం ఎండబెట్ట లేని పరిస్థితిలో ఉన్న రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. గత నాలుగు రోజుల నుండి రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్,  సబ్ కలెక్టర్ , తహశీల్దార్లు, సొసైటీ చైర్మన్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. కానీ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రైస్ మిల్లుల కేటాయింపు ఇప్పటికీ జరగకపోవడంతో సొసైటీ సిబ్బంది చేసేది ఏమీ లేక ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్ తో సొసైటీ కార్యదర్శిలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైస్ మిల్లర్ల కేటాయింపు జరగాలని సొసైటీ కార్యదర్శిలు విన్నవించినట్లు తెలిసింది. ప్రజా ప్రతినిధులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇటు ప్రారంభిస్తూనే మరోవైపు దళారులు ధాన్యాన్ని కొనుగోలు చేసి రవాణా చేస్తున్నారు. దీనితో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాల్‌ రూ.2,320, బీ గ్రేడ్‌ రూ.2,300 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు సన్ ఆఫ్ ధాన్యముకు అదనంగా మరో 500 రూపాయలు బోనస్ ఇవ్వడంతో క్వింటాలుకు 2800 ఉండగా దళారులు 23:50కి కొనుగోలు చేస్తూ వారం రోజులు ధాన్యం డబ్బులు తిరిగి ఇస్తామంటూ హామీలు ఇస్తున్నారు. మూడు రోజుల్లో ధాన్యం డబ్బులు కావాలంటే 1 లక్షకు వేయి రూపాయలు కట్ చేసుకుని  ఇస్తున్నారు. దీనితో రైతులకు 500 బోనస్ లక్షకు వేయి రూపాయల చొప్పున నష్టం జరగనుంది.
కష్టపడి పండించిన ధాన్యం దళారుల పాలు..
ఆరుగాలం కష్టపడి పడించిన ధాన్యం పంటను దళాలకు విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సభలు సమావేశాల్లో పాలక నేతలు అధికారులు సలహాలు సూచనలు చేస్తున్నప్పటికీ దళారులు చెప్పే మాటలకు దళారుల మాయలో పడి రైతులు తక్కువ ధరకు ధాన్యం విక్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతో ధాన్యం అమ్ముకోవడానికి  రెైతులు అష్టకష్టాలు పడాల్సివస్తోంది. కొనుగోలు కేంద్రాల్లోని ఇబ్బందులకు తాళలేక రైతులు ఇష్టానుసారంగానే దళారీలకు అమ్ముతుండటం.. పైగా తమ ప్రూఫ్స్‌ కూడా ఇస్తుండటంతో దళారీల పని సులువవుతోంది. ఈ విషయాన్ని బయటకు వెల్లడించేందుకు కూడా రైతులు ముందుకు రావడం లేదు. పైగా దళారీ ధాన్యానికి సంబంధించిన నగదు వెంటనే చెల్లించాలని రైతు కోరితే నూటికి రూ.1-2 రూపాయల చొప్పున కోత పెడుతున్నట్టు కొందరు రైతులు  బహిర్గతంగా తెలుపుతున్నారు. పదిరోజుల సమయం ఉంటే మాత్రం ఎలాంటి కోత పెట్టకుండా నగదు చెల్లిస్తామని దళారులు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించేలా తగు చర్యలు తీసుకోవాలని గ్రామీణ ప్రాంతా రైతులు కోరుతున్నారు.