– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
ఎర్ర జెండా ఉద్యమాలను మరింత ముందుకు తీసుకపోవడం ద్వారానే చిట్టిపోలు సత్తయ్య ఆత్మకు శాంతి కలుగుతుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. ఇటీవల అనారోగ్యంతో అకాలంగా మతి చెందిన చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు చిట్టిపోలు సత్తయ్య సంతాప సభ సోమవారం మండలంలోని పుట్టపాక గ్రామంలో చేనేత కార్మిక సంఘం,సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడారు. రాజకీయాలన్ని కలుషిత మయ్యాయన్నారు. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎప్పుడు మారుతారో తెలియని రోజులు వచ్చాయన్నారు. అధికారం కోసం బూర్జువా పార్టీల నాయకులు మద్యం, ధన ప్రవాహాలకు ప్రజలను గురి చేస్తున్నారన్నారు.ఇట్లాంటి రోజుల్లో చివరివరకు ఎర్రజెండా,నేత కార్మికుల పక్షాన పోరాడిన సత్తయ్య నిజమైన ఆదర్శ కమునిస్టన్నారు.శత్రువుతో ఇబ్బందులు వచ్చినప్పుడు నికరంగా నిలబడిన వాడే నిజమైన కమ్యూనిస్టు అన్నారు.అది అందరికీ సాధ్యం కాదన్నారు.కేవలం చిట్టిపోలు సత్తయ్య లాంటి వ్యక్తులకే సాధ్యమన్నారు. చిట్టిపోలు సత్తయ్య ఎన్ని నిర్బంధాలు ఎదురైన తను ఎంచుకున్న ఎజెండా,ఎర్రజెండా కోసం చివరి వరకు నిలబడ్డారన్నారు.సత్తయ్య అకాల మతి పార్టీ,చేనేత ఉద్యమానికి తీరని లోటన్నారు. సత్తయ్య కుటుంబానికి పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులు సైతం పార్టీకి అండగా నిలవాలన్నారు.సత్తయ్య ఆశయ సాధన కోసం కార్యకర్తలు మరిన్ని ఉద్యమాలు నిర్వహించాలన్నారు. అంతకుముందు సత్తయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి,సీనియర్ నాయకులు దొంతగాని పెద్దులు,తుమ్మల నర్సిరెడ్డి,పుట్టపాక ఎంపీటీసీ సభ్యులు మర్రి వసంత,అయిత రాజు గాలయ్య,ఉప సర్పంచ్ వర్కాల చంద్రశేఖర్,గ్రామ శాఖ కార్యదర్శి పిట్ట రాములు,మండల కమిటీ సభ్యులు చింతకాయల నరసింహ,సింగిల్ విండో డైరెక్టర్ కేసిరెడ్డి యాదవ రెడ్డి,విద్యా కమిటీ చైర్మన్ గాలయ,డివైఎఫ్‌ఐ నాయకులు దొంతగోని అమరేందర్,నాయకులుకర్నాటి రామచంద్రం,పంకర్ల యాదయ్య,రావిరాల మల్లేశం,కొంగరి మారయ్య,కేశవరెడ్డి జయమ్మ,గాజుల అంజయ్య,చిట్టిపోలు నాగరాజు, కుటుంబ సభ్యులు చిట్టిపోలు సరస్వతి,శంకర్ పాల్గొన్నారు.