– కేటీఆర్ ను కలిసిన బాన్సువాడ టిఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ – బాన్సువాడ / నరుసురుల్లాబాద్
ఉద్యమ సమయం నుంచి మీ వెంటే ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో నైనా మీ వెంటే ఉంటూ మీ నాయకత్వంలో ముందుకు వెళ్తాం అని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ను కలసిన బాన్సువాడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. మంగళవారం బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్ వర్ని కోటగిరి బాన్సువాడ మండలాల నుంచి భారీ ఎత్తున టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలివెళ్లి కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా బాన్సువాడ బీఆర్ఎస్ నాయకుడు జుబేరు మాట్లాడుతూ.బీఅర్ఎస్ పార్టీ నుండి గెలుపొంది కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి మోసం చేశారని, బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారని బాన్సువాడ టిఆర్ఎస్ నాయకుడు షేక్ జుబెర్ తెలిపారు. కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్లు ఎంత పెద్ద వాళ్లైనా సరే వదిలిపెట్టేది లేదని వారికి కచ్చితంగా కార్యకర్తలు బుద్ధి చెప్పాలని త్వరలోనే ప్రశాంత్ రెడ్డి, ఇతర పార్టీ సీనియర్ నాయకులు సహా తాను బాన్సువాడలో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని బాన్సువాడ టిఆర్ఎస్ పార్టీ నేత షేక్ జుబేర్ తెలిపారు. ఈ సందర్భంగా జుబేరు మాట్లాడుతూ పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీ వీడలేదని, గులాబి జెండా మీద గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడినా. గ్రామాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని పార్టీ శ్రేణులు కేటీఆర్ సూచించినట్లు తెలిపారు. బాన్సువాడ టిఆర్ఎస్ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారని తెలిపారు.