కేబుల్ వైర్ దొంగతనం

Cable wire theft– చెలరేగిన దొంగలు

నవతెలంగాణ – బొమ్మలరామారం
పగలు లేదు రాత్రి లేదు విచ్చలవిడిగా రెచ్చిపోతున్న దొంగలు నిన్న రోడ్డు పక్కన నిలిపిన లారీల నుంచి డీజిల్ దొంగతనం ఈరోజు కేబుల్ వైర్ రేపు ఏమవుతుందో అని రైతులు గుబులు చెందుతున్నారు.. వివరాల్లోకి వెళ్తే బొమ్మలరామారం మండలంలోని చౌదర్ పల్లి గ్రామానికి చెందిన కూకట్ల మల్లేష్, మర్యాల నుండి చీకటిమామిడి వెళ్లే రహదారి పక్కన ఉన్నటువంటి బావి వద్ద వ్యవసాయ పనులు చేస్తారు.ఉదయం 10 గంటలకు సమయంలో బావి వద్ద రైతు లేనిది చూసి గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి కేబుల్ వైర్ కోసుకొని వెళ్తుండగా చుట్టుపక్కల ఉన్న రైతులు పెద్దగా కేకలు వేయడంతో బైక్ పై మర్యాల గ్రామం వైపు వెళ్లాడని రైతులు చెప్పారు. ఆ గ్రామంలో సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో దొంగను గుర్తించలేకపోయారు.పగలే మాకు రక్షణ లేకపోవడంతో రాత్రి సమయంలో ఎలా రక్షణ ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపడుతున్న ఎస్సై శ్రీశైలం.