హస్తంలో క్యాడర్.. బీజేపీలో కార్యకర్తలు లేరు

– కాంగ్రేస్ పార్టీకి క్యాడర్ … బీజేపీ పార్టీకి కార్యకర్తలు లేరని
– రానున్న రోజుల్లో దుబ్బాకలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : పోతారెడ్డి పేట గ్రామ  బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ ఎస్వీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ పాపని సురేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం అక్బరుపేట్ భూంపల్లి మండలంలోని పోతారెడ్డిపేట్  గ్రామంలో బీఆర్ ఎస్వీ,యువత, సోషల్ మీడియా,కమిటీల నిర్వహణ కార్యక్రమం గ్రామంలో నిర్వహించారు.ఈ కమిటీలో పోతారెడ్డిపేట్ గ్రామ బీఆర్ ఎస్ యువత అధ్యక్షుడుగా కాకి గణేష్, ఉపాధ్యక్షుడిగా దమ్మగౌని యాదగిరి,ఒర్రెల్లి స్వామి,ప్రధాన కార్యదర్శిగా రెడ్డి సాయి క్రిష్ణ ఎంపిక కాగా…  సోషల్ మీడియా అధ్యక్షుడుగా ఎర్రోళ్ల రాజు,ఉపాధ్యక్షులుగా బండి శ్రీనివాస్ గౌడ్,జూకంటి స్వామి రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా కాకి కొండల్ నియమితులయ్యారు. ఇక విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పుట్ల గారి నవీన్,ఉపాధ్యక్షులుగా చిట్టబోయిన భాను,చింతల నాగరాజు,  ప్రధాన కార్యదర్శిగా, చెక్క నవీన్,లను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జ్ పాపని సురేష్ గౌడ్  మాట్లాడుతూ…దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు,బీజేపీ పార్టీకి కార్యకర్తలు లేరని అన్నారు.భవిష్యత్ లో ఈ రెండూ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు .రానున్న రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలను బొంద పెట్టె పరిస్థితి నెలకొందన్నారు.  తామంతా ప్రభాకరన్న బాట నడిచి దుబ్బాక అభివృద్ధి కి, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి గెలుపు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోతారెడ్డిపేట్ ఉప సర్పంచ్ కమ్మరి రవి,కూడవెళ్లి దేవాలయం పాలక మండలి సభ్యుడు ,గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్,గ్రామ శాఖ అధ్యక్షుడు చిట్టబోయిన యాదగిరి,సీనియర్ నాయకులు డాక్టర్ కృష్ణ, , మిరుదొడ్డి ఏఎంసీ డైరెక్టర్ అబిలాశ్ రావ్, మాజీ డైరెక్టర్ దుబ్బాక దయాకర్ రెడ్డి  తదితరులు ఉన్నారు