సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

– అసిస్టెంట్ కమిషనర్ కు ఘన సన్మానం

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మూడు రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దు లో గల సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ హుండీ ఆదాయంరూ.3,74,137/- రూపాయలు వచ్చినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ ఆలయ అధికారి వేణు విలేకరులకు తెలిపారు. ఆలయ హుండీ గురువారం నాడు లెక్కించారు హుండీ లెక్కింపు కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ హాజరయ్యారు హుండీ లెక్కింపు తో పాటు బాన్సువాడ డివిజనల్ పరిధిలోని అన్ని మండలాల పరిధిలోగల ధూపాదీప నైవేద్య అర్చకులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ కు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ధూప దీప నైవేద్య అర్చకులు సలబత్పురాలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.