
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని కేశవపట్నం లో సమ్మక్క– సారలమ్మ జాతర ఈనెల 21 నుండి 24 వరకు నిర్వహించిన జాతర హుండీ ఆదాయం లెక్కింపు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ సంతోష్ కుమార్ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గుర్రం స్వామి,ఈవో డివి మారుతి రావు, ఎంపీడీవో శ్రీవాణి ల సమక్షంలో ఉండి లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు వచ్చిన ఆదాయం ప్రత్యేక దర్శనము రూ.1,28,840 కేశఖండనం రూ.56,130 మొక్కుబడి కింద రూ.94,080 హుండి ఆదాయం రూ.4,80,906 వేలముల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1,63,000 ఈ హుండి ద్వారా ఆదాయం రూ.3,934 మొత్తం ఆదాయం రూ.9,26,890 ఆదాయం వచ్చినట్లు, జాతర కమిటీ చైర్మన్ గుర్రం స్వామి, ఆలయ ఈవో మారుతి రావు లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారులు, బొంగోని తిరుపతి గుర్రం శ్రీనివాస్, గుర్రం బుచ్చయ్య, గుర్రం వెంకటేశం,కొత్తపెళ్లి తిరుపతి, పంజాల సంపత్ కుమార్, బండి సంపత్ కుమార్, గుర్రం శ్రీనివాస్, (జనగాం తిరుపతి,గుడిశాల సారయ్య,పూజారిలు) మేకల కోటి, బొజ్జ సుధాకర్, బొజ్జ రవి, బొజ్జ కోటిలింగం, బొజ్జ రాజయ్య, బొజ్జ చిన్న కొమురయ్య, మేకల కుమార్, మేకల శేఖర్, బొజ్జ తిరుపతి, బొజ్జ కనకయ్య,లు పాల్గొన్నారు.