లంబాడ హక్కుల పోరాట సమితి యాదాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండరు ను సోమవారం ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి రాజేష్ నాయక్ పాల్గొంటూ ఈరోజు భారతదేశంలో 16 కోట్ల మంది మాట్లాడే గోరుబోలిని రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు రాజు నాయక్ మాట్లాడుతు ప్రిభవరి 15న జరిగే సేవాలాల్ జయంతి పండుగను ప్రభుత్వము అధికారిక సెలవు దినాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు నాయక్, పట్టణ అధ్యక్షుడు మోహన్ నాయక్ ,ఉద్యోగాల సంఘ జిల్లా నాయకులు నరసింహ నాయక్, జిల్లా నాయకులు, దేవేందర్ నాయక్ హచ్చు నాయక్ ,నాగేశ్వర్ నాయక్ పాల్గొన్నారు.