కుక్కల దాడితో దూడ మృతి 

Calf died due to dog attackనవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామంలో బుధవారం కుక్కలు దాటితో దూడ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మర్యాల గ్రామానికి చెందిన ఈదులకంటి రాజు రెడ్డి ఉదయాన్నే పొలం వద్దకు వెళ్లగా కుక్కలు దూడ పై దాడి చేసి తినడం చూసి కుక్కల తరిమికొట్టగా దూడ అప్పటికి మృతి చెందింది. చుట్టుపక్కల కోళ్ల ఫారం లు ఉండడంతో చనిపోయిన కోళ్లను, వాటి వ్యర్ధాలను చుట్టుపక్కల పడేయడంతో కుక్కలు విచ్చలవిడిగా తిరిగి చనిపోయిన కోళ్లను తింటున్నాయి. కోళ్ల ఫారంలో కోళ్లు లేని సమయంలో ఇలా దూడలను తినడం మొదలు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎన్నిసార్లు కోళ్ల ఫారం యజమానానికి చెప్పిన ఎవరు పట్టించుకోవడంలేదని కోళ్ల ఫారం యజమానియం పై కఠిన చర్యలు తీసుకోవాలని, చనిపోయిన దూడకి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.