
క్రీడలతో శరీర ద్రాడుత్వం తో పాటు ..మానసిక ఉల్లాసం పెంపొందుతుంది అని పరకాల బీజేపీ ఇన్చార్జి కాళి ప్రసాద్ అన్నారు.మండలంలోని గంగదేవిపల్లిలో సంక్రాంతి సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు మడిశెట్టి రాజు ఆర్గనైజ్ చేయగా ప్రథమ స్థానం కాశీబుగ్గ, ద్వితీయ స్థానం చంద్రయ్యపల్లి జట్లు కైవసం చేసుకున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకులు విజయచందర్ రెడ్డి, పరకాల ఇన్చార్జి కాళి ప్రసాద్ విజేతలకు ట్రోపిని ప్రధానం చేసి మాట్లాడారు. టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన మాడిశెట్టి రాముడిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పగడాల రాజ్కుమార్, చోక్కం శ్రీనివాస్, నిమ్మగడ్డ విక్రమ్, కూతురు రాజు, రహ్మతుల్ల తదితరులు పాల్గొన్నారు.