బాల్యవివాల నిర్మూలన కోసం చైల్డ్ లైన్ 1098 కి ఫోన్ చేయండి

– చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సంతోష్
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కామారెడ్డి ఆధ్వర్యంలో బాలికలకు బాలల హక్కుల పరిరక్షణ, రక్షణా సంరక్షణ అవసరం వున్నా పిల్లలను గుర్తించి వారి అవసరం అయినా సదుపాయాలు కల్పించడం, బాల్య వివాహాలు నిర్ములించడం, ఎవరైనా బాలల పైన లైంగిక వేధింపులు లకు గురి చేసినాట్లయితే వారి పైన పొక్సో కేసు పెట్టడం జరుగుతుంది అని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సంతోష్  తెలియజేయడం జరిగింది. మరియు ఎవరైనా గ్రామాలలో బాల్య వివాహాలు చేసినట్లుయితే చైల్డ్ లైన్ 1098 కి సమాచారం అందిచలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు.