ప్రశాంతంగా పరీక్షా కేంద్రం

– నవోదయ పరీక్షకు 15 మంది గైర్హాజర్
నవతెలంగాణ – అశ్వారావుపేట

నవోదయ ప్రవేశం కోసం శనివారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 86 మంది రాయాల్సి ఉండగా 15 మంది గైర్హాజర్ అయ్యారు.స్థానిక ఉన్నత పాఠశాల లో నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షలకు క్లస్టర్ లెవల్ అధికారిగా ఎం.ఈ. క్రిష్ణయ్య, బ్లాక్ లెవెల్ అధికారి గా ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత వ్యవహరించారు.