ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు

నవతెలంగాణ – మిరు దొడ్డి 
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో బుధవారం ప్రారంభమైనాయి. మిరుదొడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో 295 మంది విద్యార్థులకు 289 మంది విద్యార్థులు హాజరైనట్లు పరీక్షల ముఖ్య కార్యనిర్వాహక అధికారి శ్రీనివాస్ తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఒక నిమిషం నిబంధన ఉండడంతో విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి హాజరైనారు.